రాజకీయాలు కాదు, ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం కార్పొరేటర్ శాంతి సాయిజెన్

రాజకీయాలు కాదు, ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం కార్పొరేటర్ శాంతి సాయిజెన్

నాచారం, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ నాచారం రైతు బజార్‌లోని బోర్‌వెల్ కొద్దీ రోజుల క్రితం పాడిపోయింది. దీని కారణంగా మార్కెట్ వాసులు, కూరగాయల వ్యాపారస్తులు, బస్తీ దవాఖానకు వచ్చే వారు మరియు డాక్టర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ దృష్టికి తీసుకురావడం జరిగింది.
హైదరాబాద్‌లో బోర్‌వెల్‌ల రిపేర్ లేదా మెయింటెనెన్స్ జిహెచ్ఎంసి ద్వారా చేయడంలేదని కార్పొరేటర్ తెలిపారు. దీంతో, ఆయన స్వయంగా తన ఖర్చుతో బోర్‌వెల్ రిపేర్ చేయిస్తానని హామీ ఇచ్చి, ఆ పని చేపట్టారు.ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారస్తులు కార్పొరేటర్‌ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మణ్ కిట్టు, మూర్తి దయానంద్, కిషోర్, రమేష్, వేణు, తరుణ్, నిర్మల, రాము, రాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.కార్పొరేటర్ శాంతి సాయిజెన్ మాట్లాడుతూ, “రాజకీయాలు కాదు, ప్రజల శ్రేయస్సే నా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .