అమ్మపల్లి గ్రామంలో పోషకాహార సరుకుల పంపిణీ

అమ్మపల్లి గ్రామంలో పోషకాహార సరుకుల పంపిణీ

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులు, గర్భిణీ,బాలింతలకు సరుకులు

పెద్దమందడి,ఫిబ్రవరి7(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు, గర్భిణీ మహిళలకు, బాలింతలకు పోషకాహార సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అమ్మపల్లి గ్రామ సర్పంచ్ మాధవి వెంకటేశ్వర్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లలకు, గర్భిణీ బాలింతలకు బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు పంపిణీ చేశారు. అలాగే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు చిన్నారులకు బాలామృతం, 25 రోజులకు గానూ 16 గుడ్లు అందజేశారు. ఇంటికి తీసుకెళ్లే రేషన్ విధానంలో సరుకులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని సమగ్ర శిశు అభివృద్ధి పథకం పర్యవేక్షకురాలు నాగరాణి  ఆధ్వర్యంలో నిర్వహించారు.చిన్నారుల బరువులు, ఎత్తులు కొలిచి నమోదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవి , సమగ్ర శిశు అభివృద్ధి పథకం పర్యవేక్షకురాలు నాగరాణి ,లబ్ధిదారులు, అంగన్వాడీ టీచర్లు శారద, సువర్ణ, మంజుల, చెన్నమ్మ, బాలమణి, గ్రామస్తులు, యువజన సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .