త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.

ముఖ్య అతిథిగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీనివాస్ రావు హాజరు.

త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.

 సత్తుపల్లి, ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలోని త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ వై. యార్లగడ్డ వెంకటేశ్వరరావు హాజరుకాగా, సత్తుపల్లి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సరిత, క్యాంపస్ ఇన్‌చార్జ్ వంశీ, కిడ్స్ ఇన్‌చార్జ్ పద్మ, అకాడమిక్ ఇన్‌చార్జ్ పవన్ పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఫన్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి ప్రతిభను చూసి హాజరైనవారు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం. శ్రీనివాస్ రావు విద్యార్థుల ప్రదర్శనలను ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అలాగే పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొని వేడుకలను మరింత శోభాయమానంగా మార్చారు. ఈ వేడుకలను విద్యార్థులు ఆనందోత్సాహాలతో, హర్షాతిరేకాలతో జరుపుకోవడం విశేషం.IMG-20260207-WA0099IMG-20260207-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .