వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం

వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం

22వ వార్డు అభ్యర్థి అరుణకు మద్దతుగా పెద్దమందడి మండల నాయకుల విస్తృత ప్రచారం

వనపర్తి ఫిబ్రవరి7(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దమందడి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఆదేశాల మేరకు వనపర్తి పట్టణం 22వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి  ఏ. అరుణ (మెకానిక్ శ్రీను) కి మద్దతుగా ప్రజలను కలిశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి గడప వద్ద ప్రజల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై అపారమైన అభిమానాన్ని చూశామని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ వ్యవసాయం పచ్చగా కళకళలాడుతోందని పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా కారు గుర్తుకే మా ఓటు అని చెబుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి గ్రామ కమిటీ అధ్యక్షుడు సేనాపతి, ఉపాధ్యక్షులు జంగం రమేష్ ,పురుషోత్తం రెడ్డి, అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి , హరికుమార్ రెడ్డి , ఆశిరెడ్డి , పాల్గొన్నారు. అలాగే వార్డు మెంబర్లు కొమ్ము బ్రహ్మయ్య ,కొమ్ము విష్ణు , సింగిరెడ్డి వెంకటస్వామి, గోవర్ధన్ రెడ్డి , తదితరులు ఈ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .