వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఎంపీ ఈటాల రాజేందర్ నిధులతో మహిళా భవన్, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి

వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

వినాయక్ నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఎంపీ ఈటాల రాజేందర్ నిధులతో శివ నగర్ ఫేజ్–1లో మహిళల కోసం మహిళా భవన్ నిర్మాణానికి రూ.10 లక్షలు, వినాయక్ నగర్ లైన్ నెంబర్–25లో బుడుగ జంగం వారి కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి రూ.15 లక్షలు మంజూరు చేశారు.ఈ పనులకు కార్పొరేటర్ రాజ్యలక్ష్మి శుక్రవారం కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా భవన్ నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి ద్వారా సామాజిక కార్యక్రమాలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ నవీన్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సాగర్, వెంకటేష్, శివ నగర్ ప్రెసిడెంట్ అంజయ్య, పరమేష్, దినేష్, వెంకటేశ్వర్లీ, మల్లేష్ యాదవ్, సోమనాథ్, వెంకటేష్, శంకరాచారి, అనసూయ, సుమతో పాటు బీజేపీ నాయకులు ఓం, సాయి, జగదీష్, నరేందర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, అందరి భాగస్వామ్యంతో మరిన్ని పనులు చేపడతామని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు.IMG-20260207-WA0102

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .