టిడబ్ల్యూజేఎఫ్ హెచ్ - 2843 యూనియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం
*పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత*
*మొక్కలు నాటిన టి డబ్ల్యూ జేఎఫ్ ప్రెస్ క్లబ్ బృందం*
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 07(తెలంగాణ ముచ్చట్లు)
పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత అని, వనజీవి రామయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టిడబ్ల్యూజేఎఫ్ హెచ్ - 2843 యూనియన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని అర్బన్ పార్క్
(వేలుగుమట్ల)లో టిడబ్ల్యూజేఎఫ్ హెచ్2843 ప్రెస్ క్లబ్ అధ్యక్షతన ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథుల రాక - వన ప్రేమికుల సందడి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ అధికారులు సిబ్బంది మరియు యూనియన్ బాధ్యులు సభ్యులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
టిడబ్ల్యూజేఎఫ్ హెచ్-2843 జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అరవపల్లి నాగేష్ ముఖ్య ఆహ్వానం పలికారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ మాట్లాడుతూ,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం మొక్కలనికొనియాడారు.ప్రాణవాయువు మొక్కలు కేవలం ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా, భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షిస్తాయని తెలిపారు.వర్షాలు అడవులు,చెట్లు సమృద్ధిగా ఉంటేనే సరైన సమయంలో వర్షాలు కురుస్తాయని, తద్వారా వ్యవసాయం బాగుంటుందని గుర్తుచేశారు.వనజీవి స్ఫూర్తి: పద్మశ్రీ అవార్డు గ్రహీత,
కోటి మొక్కల ప్రదాత వనజీవి రామయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టానని ఆయన వివరించారు.ప్రభుత్వానికి విన్నపం: మున్సిపల్ అధికారులు భవన నిర్మాణాలకు ప్లానింగ్ ఇచ్చే సమయంలో,కనీసం ఒకటి లేదా రెండు గజాల స్థలాన్ని మొక్కల కోసం కేటాయించాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పెద్ద పెద్ద యూనియన్ నాయకులు కూడా చేయని ఆలోచనను శ్రీనివాస్ చేసి చూపించారని, సామాజిక బాధ్యత గల విలేకరిగా ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ప్రాముఖ్యతను వివరించిన ప్రధాన కార్యదర్శి
జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ మాట్లాడుతూ, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే క్రమంలో ఇంజనీర్లు, ప్లానర్లు ప్లాట్లు చేసేటప్పుడు చెట్లను నరికివేయడం రోడ్డు విస్తరణ పనులు చేసినప్పుడు కూడా చెట్లను తొలగించడం బాధాకరమని, ఆ స్థానంలో తిరిగి మొక్కలు నాటేలా ప్లానింగ్ ఉండాలని సూచించారు. ప్రతి మనిషి తమ ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల సందర్భంగా ఒక మొక్క నాటే సంప్రదాయాన్ని మొదలుపెట్టాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన జిల్లా నాయకులకు, తోటి విలేకరులకు, సహకరించిన అధికారులకు అంతోటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొని, తాము నాటిన మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో వివాహ దినోత్సవ సందర్భంగా యూనియన్ నాయకులు విలేకరులు కమిటీ సభ్యుల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజే హెచ్ 2843 జిల్లా కోశాధికారి ఆరోపణ నగేష్ ఖమ్మం జిల్లా మీడియా ఫోటోగ్రాఫర్ అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్ టీబీజేఏ జిల్లా కోశాధికారి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు వెలుగోటి వెంకట్ నగర అధ్యక్షులు గంటల కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు రాకేష్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి మల్లెల శిల్ప పట్టణ సహాయ కార్యదర్శి చెన్నం శెట్టి రాంబాబు ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ పోయెలబోయిన శ్రీను, కొండ శ్రీనివాస్ షేక్ మీరా సునీత తేళ్ల శ్రీనివాసరావు
పాగ యోనా తదితరులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments