అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం

ఈ నెల 9 నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):

సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరాల కాలానికి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అర్హత కలిగిన జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్http://ipr.telangana.gov.in�
ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.జిల్లా స్థాయిలో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంటూ, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మను చౌదరి కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .