సీఎం కప్ క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం.

బి గంగారంలో నియోజకవర్గ స్థాయి పోటీల ప్రారంభం.

సీఎం కప్ క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):

మండల పరిధిలోని బి గంగారం గ్రామంలోని శ్రీ దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలకు శనివారం ఘనంగా శ్రీకారం చుట్టారు. దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టి నాయన) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టి నాయన), గంగారం గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి, ఉప సర్పంచ్ బెజవాడ రాధ, ఎంఈఓ, నియోజకవర్గంలోని క్రీడాకారులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, దాసరి మధు అన్న యువసేన సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260207-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .