వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం... 

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 

వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం... 

ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు)

 వైరా మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ వైరా మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డు నిమ్మ తోట శ్రావణి . 7 పణితి సైదులు . 9. కట్ల సంతోష్ 17 బత్తుల సుమతి.18 గోరింట్ల  శ్రీదేవి .19. వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి చింత నిప్పు సులోచన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే రామదాసు నాయక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ పీసీసీ కార్యదర్శి కట్ల రంగన్నతో కలిసి వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు అభ్యర్థులకు ప్రజలు అడుగడుగున  జననీరాజనాలు పలికారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించే బాధ్యత మాది అని ప్రజలు నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివిధ వార్డులలోని ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు పనులు చేసే వారికి మాత్రమే ప్రజల నుండి ఇటువంటి మద్దతు ఉంటుందని ఎప్పుడు ప్రజలు అటువంటి వారి పక్కనే నిలుస్తారని అటువంటి వారిని కోరుకుంటారని ఆయన అన్నారు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం మంత్రులు ప్రజలను పట్టించుకోలేదని అందుకే గడిల పాలనను బద్దలు కొట్టి ప్రజా పాలన తెచ్చుకున్నారని ప్రజా పాలనలో  ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోరిక మేరకు సామాన్య పేద మధ్యతరగతి వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఆయన అన్నారు కొందరు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు కళ్ళు తెరిచారని అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి అహంకారంతో ప్రజలను పట్టించుకోని వాళ్ళు ఇవాళ ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేయని వాళ్ళు ఇవాళ ఇన్చార్జిలుగా వచ్చి ఏం పనులు చేస్తారని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. మాజీ మంత్రి బాకీ కార్డు పేరుతో ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అటువంటి అబద్ధపు మాటలు ప్రజలు నమ్మరని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తామని ప్రజలకు బాకీ ఉన్న మాట వాస్తవమని త్వరలోనే మిగిలిన పథకాలు కూడా అమలు చేస్తామని కానీ అధికారం లేనివాళ్లు ఐపి పెట్టి పోయిన వాళ్ళు దివాలా తీసిన వాళ్ళు వైరా మునిసిపాలిటీలో ఏమి అభివృద్ధి పనులు చేస్తారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇందిరమ్మ ఇల్లు ఉచిత కరెంటు రైతులకు రుణమాఫీ పండించిన వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశామని పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చూసి ఓర్వలేక తిరిగి అధికారం రాదని మనోవేదనతో కారు కూతలు కూస్తున్నారని ఈనెల 13వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాలతో ఆ నోరు మూసుకోవాల్సి వస్తుందని ఫలితాల తర్వాత నాయకులు కంటికి కూడా కనపడని  ఆయన అన్నారు నూటికి నూరు శాతం వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ పిసిసి కార్యదర్శి కట్ల రంగారావు మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు. మండల పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ IMG-20260207-WA0079సూతకాని జైపాల్. యువజన విభాగం అధ్యక్షుడు గరిడేపల్లి కిషోర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం మీరా ఎస్ కే బీభా. వేముల రత్నాకర్ కట్ల నాగరాజు చెరుకూరి కిరణ్ పాణ్యం భాస్కర్ గుత్తికొండ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
వినాయక్ నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు): మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఎంపీ ఈటాల రాజేందర్ నిధులతో శివ నగర్...
జె.కే కాలనీలో నూతన బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.
ఎన్ఎఫ్ఏఈఆర్ సమావేశం విజయవంతం
ఏదులాపురంలో ‘ప్రసాద్ రెడ్డి’  ప్రచారం!
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో “ప్రజావాణి” రద్దు