కుషాయిగూడలో పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

నాలుగు నెలల్లో రూ.14.25 లక్షల ఆదాయం

కుషాయిగూడలో పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

కుషాయిగూడ, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్  కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్. ప్రణీత్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, గత నాలుగు నెలల కాలానికి గాను మొత్తం రూ.14 లక్షల 25 వేల 595 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఉప్పల యాదగిరి రెడ్డి, కార్యనిర్వాహణ అధికారి మఠం వీరేశం పాల్గొన్నారు. అలాగే ఆలయ వ్యవస్థాపక సభ్యులు పల్లె సురేందర్ రెడ్డి, పల్లె శ్రీకాంత్ రెడ్డి, ఆలయ మాజీ ధర్మకర్తలు సుధాకర్ రెడ్డి, వట్టికూటి లక్ష్మీనారాయణ హాజరయ్యారు.ఆలయ అర్చకులు బీటుకూరు లక్ష్మాచార్యులు, కలకోట వెంకటరమణాచార్యులు, ఆరుట్ల నారాయణాచార్యులు, ఆరుట్ల వేణుగోపాలాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది నరేష్, గుంటూరు శ్రీనివాస్, మహేందర్, నాగమ్మ, నాగరాజు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.అలాగే భక్తులు ములుగు బసంత్ రెడ్డి, ములుగు శ్రీకాంత్ రెడ్డి తో పాటు శివకేశవ సేవా సమితి సభ్యులు సుమారు 50 మంది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .