సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

కాలనీలో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

ఉప్పల్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో అతి త్వరలోనే మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కాలనీలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.శనివారం ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి విజయపురి కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ సదుపాయాల లోపం, సీసీ రోడ్ల అవసరం, తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్, అతి త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ వెనీల్ గౌడ్, ఏఈ రాజ్ కుమార్, విజయపురి కాలనీ అధ్యక్షులు లింగారెడ్డి, దేవి రెడ్డి, సుంకు శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీపతి నరేందర్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల రాజేందర్ రెడ్డి, జంగా రెడ్డి, వెంకటేష్, ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఎస్. మాధవరెడ్డి, కే. మల్లారెడ్డి, రాణి, యమునా, అమృత, సుబ్బమ్మ, మస్తాన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిక్షం రెడ్డి, సుదర్శన్, జి. వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బిక్షపతి, పి. శ్రీనివాస్ రెడ్డి, కే. శ్రీనివాస్, అల్లా బాషా, నాగూర్ భాష, జాంగిర్, సోమిరెడ్డి, ఎన్. రాజేందర్, బొమ్మజి రత్నం, లెక్కల అంజిరెడ్డి, బెన్నీ భీమ్ సేన్, బడుగుల ఉపేందర్ యాదవ్, సుబ్బారెడ్డి, నాగు నాయక్, మోహన్ నాయక్, అన్వర్ పాషా, కంచం మీద శ్రీనివాస్, సురేష్ యాదవ్, మౌలానా, చింతకింద శ్రీనివాస్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260207-WA0088

Tags:

Post Your Comments

Comments

Latest News

వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
వినాయక్ నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు): మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఎంపీ ఈటాల రాజేందర్ నిధులతో శివ నగర్...
జె.కే కాలనీలో నూతన బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.
ఎన్ఎఫ్ఏఈఆర్ సమావేశం విజయవంతం
ఏదులాపురంలో ‘ప్రసాద్ రెడ్డి’  ప్రచారం!
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో “ప్రజావాణి” రద్దు