ప్రచారంలో దూసుకుపోతున్న..ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు

ప్రచారంలో దూసుకుపోతున్న..ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 7(తెలంగాణ ముచ్చట్లు) 

వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిని ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు  20 వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారలో ఆమెకు మంచి స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా ఉండ్రు వరలక్ష్మి మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా ముందడుగు తో సేవ అనేది మాటల్లో కాదు ఆచరణ చూపించాలని నమ్మకంతో ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కోసమే పనిచేస్తూ ఇప్పుడు ప్రజల ఆశీస్సులతో ఎన్నికల ద్వారా మరింత విస్తృతంగా సేవ చేయలేని సంకల్పంతో 20 వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నానని ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సేవ చేయటానికి ఒక మార్గం లభిస్తుందని ఆశతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మీ పవిత్రమైన ఓట్లను హస్తం గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు. సామాజిక కార్యకర్తగా లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవలు అందించి సేవా విలువలను ప్రవేశపెట్టాలని లక్ష్యంతో ఎన్నికల్లో పాల్గొంటున్నానని ఆమె తెలిపారు సేవ అనేది మాటల్లో కాదు ఆచరణలో చూపించాలి అనే నమ్మకంతో  గత  లైన్స్ క్లబ్ ద్వారా ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కోసమే పని చేస్తున్నాని ఇప్పుడు 20వ వార్డులో ప్రజల ఆశీస్సులతో మున్సిపల్  ఎన్నికల ద్వారా మరింత విస్తృతంగా సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తునాని  ఉండ్రు వరలక్ష్మి తెలిపారు. ప్రజల ఆశీస్సులు తప్పక లభిస్తాయని 20వ వార్డు ప్రజలు విశ్వసించి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాIMG-20260207-WA0081ను వరలక్ష్మి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
వినాయక్ నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు): మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఎంపీ ఈటాల రాజేందర్ నిధులతో శివ నగర్...
జె.కే కాలనీలో నూతన బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.
ఎన్ఎఫ్ఏఈఆర్ సమావేశం విజయవంతం
ఏదులాపురంలో ‘ప్రసాద్ రెడ్డి’  ప్రచారం!
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో “ప్రజావాణి” రద్దు