కీసరగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మల్కాజిగిరి సిపి
కీసరగుట్ట, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్టలో ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి శనివారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, దర్శన మార్గాలు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు.పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిపి అవినాష్ మహంతి తెలిపారు.


Comments