రమాబాయి అంబేద్కర్ జీవితం మహిళలకు ఆదర్శం

సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ 

రమాబాయి అంబేద్కర్ జీవితం మహిళలకు ఆదర్శం

వనపర్తి,ఫిబ్రవరి7(తెలంగాణ ముచ్చట్లు):

రమాబాయి అంబేద్కర్  జీవితం మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్‌గౌడ్‌ అన్నారు. రమాబాయి అంబేద్కర్  జయంతిని జై భీమ్ స్వచ్ఛంద సంఘం అధ్యక్షులు బండారు శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పలుస శంకర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రమాబాయి అంబేద్కర్ చిన్న సహకారంతోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి చేరుకున్నారని తెలిపారు.మహిళలు రమాబాయి అంబేద్కర్‌లా కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తే, కుటుంబాలు ఉన్నత స్థానాలకు చేరుకుంటాయని ఆయన అన్నారు. చావు నీది, పుట్టుక నీది, బ్రతుకంతా సమాజానిది అనే ఆదర్శ వాక్యాన్ని జీవితాంతం ఆచరించిన రమాబాయి అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినదిగా ఉందని శంకర్‌గౌడ్‌ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ సొసైటీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్‌, కవి జనజ్వాల, గంధం నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, గంధం గోవింద్‌, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .