మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలు

పోలీస్ కమిషనర్ సునీల్ దాత్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలు

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 7(తెలంగాణ ముచ్చట్లు)

ఫిబ్రవరి 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 9 తేది నుండి 13 వ తేదిన ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించే వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పెర్కొన్నారు. అదేవిధంగా ఎవరూ రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేయరాదని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా/అతిక్రమించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఎక్కడైనా డబ్బు, మద్యం ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయకూడదని తెలిపారు. 

విధి నిర్వహణలో ఉన్న పోలీసు / ఫారెస్ట్/ కేంద్ర బలగాలు హోంగార్డులు మరియు ఎస్ పి ఓ  లకు నిషేధ అంక్షాలు నుంచి మినహాయింపు వుంటుందన్నారు. 

ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీ పరిధిలో
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. ఎన్నికలలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు. 

ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ... పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని అన్నారు.పోలింగ్ సందర్భంగా ఓటర్లకు భద్రత రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైన డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.  

1. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం, ఊరేగింపులు చేయడం నిషేధం.

 2. పోలింగ్‌ కేంద్రాలకు కిలోమీటర్‌ దూరం వరకు ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు,మారణాయుధాలతో సంచరించడం నిషేధం.

 3. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదు.

 4. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధం

5 . వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం, చట్టబద్ధమైన అధికారానికి భంగం కలిగించే లేదా ధిక్కరించే నేరానికి దారితీసే అవకాశం ఉన్న ఏదైనా ప్రసంగం నిషేధం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .