జె.కే కాలనీలో నూతన బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
రూ.1.32 కోట్ల కార్పొరేటర్ నిధులతో అభివృద్ధి పనులు
Views: 16
On
వినాయక్ నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని జె.కే కాలనీలో రూ.1.32 కోట్ల కార్పొరేటర్ రాజ్యలక్ష్మి నిధులతో చేపట్టనున్న నూతన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. కాలనీ వాసులతో కలిసి కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తయితే కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యలు పరిష్కారమవుతాయని, వర్షాకాలంలో నీటి నిల్వల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్న ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు టిల్లు యాదవ్, రాము యాదవ్, సాయి సురేష్, దరమేష్ యాదవ్, లత, ఝాన్సీ, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments