18వ వార్డు అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

బీజేపీ అభ్యర్థి బి. నరసింహా

18వ వార్డు అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

వనపర్తి,ఫిబ్రవరి8(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బి. నరసింహా పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18వ వార్డు ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బి. నరసింహా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకుని, బీజేపీ పార్టీ రూపొందించిన హామీల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులతో పాటు, పేదలు, మహిళలు, యువతకు ఉపయోగపడే పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అభ్యర్థి నరసింహా మాట్లాడుతూ, 18వ వార్డు ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా దళిత మోర్చా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పెద్దమందడి మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య,మాజీ అధ్యక్షుడు తిరుపతియ్య (గున్న భాయ్) వెంకటేష్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .