జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి అభినందనలు

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ఫిబ్రవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):

జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేముల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు తదితర కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే సీనియర్ జర్నలిస్టులు దొంతుల వెంకటరామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి, కోడికంటి శ్రీనివాస్, ఎస్. ముత్యంరెడ్డి, ఓ. రమేష్, రాజులను కూడా ఆయన ప్రత్యేకంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చే బాధ్యతను జర్నలిస్టులు సమర్థంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ కమిటీకి ఎల్లప్పుడూ తన పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .