సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాలనీ సమస్యల పరిష్కారానికి హామీ

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నాచారం, ఫిబ్రవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ ఫేజ్–2లో సిసి రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వంజరి ప్రవీణ్, కాలనీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్, కోశాధికారి జనార్దన్, రంగారెడ్డి, అలీముద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్‌తో పాటు కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాల వంటి పలు సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాలనీలోని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సిసి రోడ్డు నిర్మాణంతో కాలనీవాసులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .