అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే జారె భరోసా.
తక్షణ ఆర్థిక సహాయం అందజేత.
Views: 27
On
అశ్వారావుపేట, ఫిబ్రవరి 8 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో యలమర్తి రమాదేవి భర్త కోటేశ్వరరావుకు చెందిన రేకుల షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘటనాస్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరమైన సహాయ చర్యలను వేగంగా చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments