బీబీసాహెబ్ మక్తాలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం
సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.90 లక్షల నిధుల మంజూరు
ఉప్పల్, ఫిబ్రవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
జీహెచ్‌ఎంసీతో సమానంగా శివారు కాలనీల అభివృద్ధికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. పూర్వ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీబీసాహెబ్ మక్తా ప్రాంతం ఉప్పల్ డివిజన్‌లో విలీనం అయిన నేపథ్యంలో అక్కడ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.బీబీసాహెబ్ మక్తా పరిధిలోని శ్రీశ్రీనగర్, ఎస్‌ఎన్ కాలనీ, కృష్ణారెడ్డి కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, అమృత కాలనీల్లో ఇటీవల కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు శ్రీశ్రీనగర్ కాలనీలో దెబ్బతిన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.90 లక్షల నిధులను మంజూరు చేయించినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సంబంధించిన పత్రాలను పరమేశ్వర్‌రెడ్డితో కలిసి కాలనీవాసులకు అందజేశారు.మిగిలిన కాలనీల్లో కూడా దశలవారీగా అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయించనున్నట్లు రజితాపరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంజూరైన నిధులతో పనులను సకాలంలో ప్రారంభించి, వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐలేష్ యాదవ్, నాగరాజ్, భారత్ రాజ్ గౌడ్, మనోజ్, హిమాముద్దీన్, నంద కిషోర్, అప్పన శ్రీనివాస్, నసీరుద్దీన్, పుల్లరావు, సలా ప్రభాకర్ రెడ్డి, సాయి రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments