అశోక్ నగర్ వడ్డెర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఘన కార్యక్రమం
Views: 18
On
మల్లాపూర్, ఫిబ్రవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం పాత మల్లాపూర్ డివిజన్ పరిధిలో ని అశోక్ నగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వడ్డెర సంఘం ద్వారా చేపడుతున్న సామాజిక సేవలు అభినందనీయమని కొనియాడారు. సమాజ అభివృద్ధికి సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వడ్డెరసంఘ అధ్యక్షులు బి. లక్ష్మీనారాయణ, వి. నర్సింహ, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, సంఘ కార్యదర్శులు తదితర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments