సత్తుపల్లిలో బీఆర్ఎస్‌ భారీ ఎన్నికల ప్రచారం.!

సండ్ర ఆధ్వర్యంలో ర్యాలీ, డోర్ టు డోర్ కార్యక్రమం.

సత్తుపల్లిలో బీఆర్ఎస్‌ భారీ ఎన్నికల ప్రచారం.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 8 (తెలంగాణ ముచ్చట్లు):

ఈ నెల 11వ తేదీన జరగనున్న సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. బీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీలో భారీ ర్యాలీతో పాటు డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల గుండా నిర్వహించిన ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న సండ్ర వెంకట వీరయ్య, బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, మున్సిపల్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో బీఆర్ఎస్‌ శ్రేణుల్లో విశ్వాసం పెరిగిందని నాయకులు తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.IMG-20260208-WA0129

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .