అంబేద్కర్ ఇచ్చిన ఓటు దేశప్రజల వజ్రాయుధం
కీసరలో విజయవంతమైన 209వ వారం జ్ఞానమాల కార్యక్రమం
కీసర, ఫిబ్రవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశ ప్రజల తలరాతలు మార్చేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే శక్తివంతమైన ఆయుధాన్ని దేశ ప్రజలకు అందించారని, ఆ ఓటును డబ్బులకు అమ్ముకోవద్దని మెడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ బి-బ్లాక్ అధ్యక్షుడు జనగం మహేంద్ర భూపతి అన్నారు.కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 209వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు కర్రె గణేష్, ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జనగం మహేంద్ర భూపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించి ప్రసంగించారు.అంబేద్కర్ కులం అనే రక్కసిని నిర్మూలించి, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలతో కూడిన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడని ఆయన కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నోటు కోసం ఓటును అమ్ముకోవద్దని, ఓటు అనేది దేశ ప్రజల వజ్రాయుధమని అన్నారు.ప్రతి వ్యక్తి అంబేద్కర్ జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే ఆయన ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు తెలిసి, వాటిని అధిగమించిన తీరునుంచి సమాజ మార్పుకు ప్రేరణ పొందవచ్చని పేర్కొన్నారు. సమాజంలో నిజమైన మార్పు విద్య ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కీసర మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు పులిపాక తిరుపతి, బత్తుల ఆంజనేయులు, బొల్లి మహేష్, కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శులు గంగి ఆంజనేయులు, కుర్రి పరమేష్, మంచాల మహేష్, తాళ్ల కిరణ్, ముఖ్య సలహాదారులు దాయర బాల్ నర్సింహ, రాగుల రమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. అలాగే కీసర గ్రామశాఖ నాయకులు తుడుం బాల్ రాజ్, కీసర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర వినోద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంచాల ప్రవీణ్, దుర్గం కృష్ణ, జలగం శ్రీనివాస్, 108 వైద్యులు చిత్రం రవి తదితరులు హాజరయ్యారు.


Comments