కబ్జాదారుల నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు రక్షణ

సీఎం రేవంత్‌రెడ్డికి అల్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ జీవన్ కృతజ్ఞతలు

కబ్జాదారుల నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు రక్షణ

 కాప్రా–యాప్రాల్, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా డివిజన్ లో భూ కబ్జాదారుల నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను పరిరక్షించి, దాని అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జీవన్ కృతజ్ఞతలు తెలిపారు.కాప్రా–యాప్రాల్ ప్రాంతంలో నూతనంగా అభివృద్ధి చేయనున్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా ఉన్న ఈ ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు నేడు అభివృద్ధి లభించడం శుభసూచకమని అన్నారు. గ్రౌండ్ అభివృద్ధి పూర్తయితే ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.స్థానిక యువతతో పాటు క్రీడాకారులకు ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడనుందని, క్రీడలకు ప్రాధాన్యతనిచ్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .