చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

హన్మకొండ,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):

రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమని పేర్కొంటూ, చిన్నారిపై అమానుష నేరానికి పాల్పడిన శ్రీకాంత్, గణేష్‌లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.

బాధిత చిన్నారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సమాజంలో భద్రతా వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని డా. కడియం కావ్య స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .