స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రం శేఖర్ ప్రచారం

స్టేషన్ ఘనపూర్,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 1, 9, 18 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న చింత రాజశేఖర్, ఇందు శ్రావణి, మునిగేల వెంకన్నలకు మద్దతుగా బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నాయని ఇబ్రం శేఖర్ విమర్శించారు. రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వారు పథకాల పేర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఎన్నికల సమయంలో కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. సామాజిక వర్గాలను కూలీల మాదిరిగా భావిస్తూ, వారి ఓట్లతోనే రాజకీయాలు సాగిస్తున్నారని అన్నారు. నిజమైన అభివృద్ధి, సామాజిక న్యాయం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా ఇన్‌చార్జులు జేరిపోతుల మల్లయ్య, పైసా శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు మడిపడిగ చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, సీనియర్ నాయకులు గుండె నాగరాజు, బాస్కుల భిక్షపతి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .