ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

-ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పరమేశ్వర్ రెడ్డి 

-ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని అభినందించిన పరమేశ్వర్ రెడ్డి 

 ఉప్పల్,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జీ మందముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.   సోమవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులు  పరమేశ్వర్ రెడ్డి ను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పల్  ప్రెస్ క్లబ్ నూతన  అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన  వేముల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్. ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు మరియు సీనియర్ జర్నలిస్టులు  దొంతుల వెంకటరామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి,పల్లా  మహేందర్ రెడ్డి, కోడికంటి శ్రీనివాస్, ఎస్. ముత్యంరెడ్డి, ఓ.రమేష్, రాజులను ఆయన అభినందించారు.  ఈసందర్భంగా  పరమేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ ఉప్పల్  నియోజకవర్గ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎనలేనిదని తెలిపారు.  పాత్రికేయులకు తాను ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు  నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ కమిటీకి తన వంతు సహాయక సహకారాలు  ఉంటాయని పరమేశ్వర్ రెడ్డి  తెలిపారు.IMG-20260209-WA0132

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .