విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం

విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరం

హన్మకొండ,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):

జిల్లా పర్యవేక్షణలో భాగంగా సోమవారం పీఎస్ డీఐటీ టీమ్–2 ఐనవోలు మండలం నర్సిములాగూడెం ప్రాధమిక పాఠశాలను సందర్శించింది. ఈ పర్యవేక్షణ బృందంలో నోడల్ ఆఫీసర్ ఎల్. నరేంద్రనాయక్, సభ్యుడు బి. శివప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బృందం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. రవీందర్, ఉపాధ్యాయుడు **వంశీధర్**లతో సమావేశమై పాఠశాలలో కొనసాగుతున్న విద్యా, విద్యేతర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించింది. అడ్మిషన్ రిజిస్టర్‌లో సర్టిఫికెట్ పేజీ ప్రాధాన్యతను వివరించడంతో పాటు వివిధ రకాల రికార్డులను పరిశీలించారు.

తరగతి గది పరిశీలన సందర్భంగా విద్యార్థుల గుణాత్మక ప్రగతికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని బృంద సభ్యులు ప్రశంసించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు–విద్యార్థుల మధ్య కనిపించిన అనుబంధాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అయితే విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపుపై మరింత శ్రద్ధ అవసరమని అభిప్రాయపడ్డారు.

పాఠశాలలో గ్రంథాలయ గది ఉన్నప్పటికీ అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేని అంశాన్ని బృందం గుర్తించింది. టీచర్ హ్యాండ్బుక్, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌ల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులకు గుర్తుచేశారు. అలాగే పాఠశాల ఆవరణలో విశాలమైనIMG-20260209-WA0124 ఆట స్థలం ఉండటం విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటూ, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .