7, 25 వార్డుల అభివృద్ధికి కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను గెలిపించాలి
జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలోని 7, 25 వార్డులు అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను కౌన్సిలర్‌గా గెలిపించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.ఈ మేరకు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి, మున్సిపాలిటీ ఎన్నికల పరిశీలకుడు సంభాని చంద్రశేఖర్‌లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.గడపగడపకు వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ, రేషన్ కార్డు లేని వారికి కొత్త కార్డులు, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు.గత పదేళ్ల కాలంలో వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని, అవినీతి జరిగిందని విమర్శించారు.మళ్లీ ఆ తప్పు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, 7, 25 వార్డుల్లో ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
కదిరే రాములు యాదవ్ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేసిన వ్యక్తిగా రాములు యాదవ్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు. 7వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, అవి పరిష్కారం కావాలంటే కదిరే నాగమ్మను గెలిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.7, 25 వార్డుల్లో రాములు యాదవ్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ ఇచ్చినా ఆలస్యం కావడంతో హస్తం గుర్తు రాలేదని, ఫుట్ బాల్ గుర్తు వచ్చిందని తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఫుట్ బాల్ గుర్తుకు వేసి కదిరే నాగమ్మ రాములు యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, జిల్లా వికలాంగుల సెల్ అధ్యక్షుడు గంజాయి రమేష్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం వినోద్, గోపాల్‌పేట్ మండలం జనరల్ సెక్రటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, ఎస్టీ సెల్ నాయకుడు దేవిజా నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సహదేవుడు, హరిబాబు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండన్న, బాల్ రాజు, రఘువర్ధన్ రెడ్డి, 7, 25 వార్డుల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments