అశోక్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ విద్యార్థి సేన క్రికెట్ టోర్నమెంట్

అశోక్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ విద్యార్థి సేన క్రికెట్ టోర్నమెంట్

కాకతీయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):

కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్, అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ రెండవ రోజు కార్యక్రమాన్ని సేవాలాల్ విద్యార్థి సేన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వంకుడోత్ అశోక్ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంజారా గిరిజన విద్యార్థులు విద్యతో పాటు శారీరక దృఢత్వం, వ్యాయామ విద్య, క్రీడల ద్వారా విజ్ఞానాన్ని, సోదర భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. సేవాలాల్ ఆశయాల సాధన కోసం ప్రతి బంజారా విద్యార్థి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈ విధంగా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని, బంజారా విద్యార్థుల ఉత్సాహం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

యూనివర్సిటీలోని దాదాపు 32 విభాగాలకు చెందిన విద్యార్థులు, గిరిజన సంఘాల నాయకులు, సేవాలాల్ సేనతో పాటు ఇతర వర్గాల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ, క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, సోదర భావం పెంపొందించడంలో కాకతీయ యూనివర్సిటీ బంజారా విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రమేష్ నాయక్, లైబ్రరీ ఇంచార్జ్ జవహర్, ప్రొఫెసర్ ఈసం నారాయణ, హన్మకొండ సేవాలాల్ సేన అధ్యక్షుడు మురళి నాయక్, సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ నాయక్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పవన్ నాయక్, శ్రీను, వెంకన్న, సచిన్, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .