గంగిరెద్దుల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం

స్పందించిన మోజర్ల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్

గంగిరెద్దుల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం

పెద్దమందడి,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు);

పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ పరిధిలోని బుర్రవాగు సమీపంలో నివసిస్తున్న గంగిరెద్దుల కుటుంబాలు విద్యుత్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ దృష్టికి వచ్చింది. ఈ సమస్యపై ఆయన వెంటనే స్పందించారు.సర్పంచ్ చొరవతో విద్యుత్ శాఖ ఏఈతో సంప్రదింపులు జరిపి,అవసరమైన విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయించారు. దీంతో గంగిరెద్దుల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చి వారి దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ సందర్భంగా విద్యుత్ సమస్యను పరిష్కరించిన గ్రామ సర్పంచ్  చంద్రశేఖర్‌కు గంగిరెద్దుల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .