ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఎంపీ ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం
మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం : ఈటల రాజేందర్
మేడ్చల్ మల్కాజిగిరి, ఫిబ్రవరి 9 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు.ప్రచారంలో భాగంగా ముదిరాజ్ సంఘం, దళిత సామాజిక వర్గాల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు మరియు ముఖ్య నాయకులతో ఎంపీ ఈటల రాజేందర్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై ఆయన వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా, సుభిక్షంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. పట్టణాలు, నగరాలు, వార్డుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాల ద్వారా భారీగా నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.రానున్న ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments