కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు: జిల్లా కలెక్టర్ మను చౌదరి

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

కీసర, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):

మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వీఐపీ దర్శనాల కారణంగా సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సోమవారం కీసరగుట్టకు వచ్చిన కలెక్టర్ ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి ఐపీఎస్, ఆర్డీఓ రాజేష్, ఆలయ కమిటీ చైర్మన్ తటాకం వెంకటేశ్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు.సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన క్యూ లైన్లను విస్తరించాలని, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి రద్దీ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.జాతర ప్రాంగణంలో అత్యవసర వైద్య సేవల కోసం వైద్య సిబ్బంది, అంబులెన్సులు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎండ తీవ్రత నేపథ్యంలో క్యూ లైన్లు, దర్శన మార్గాలు, ఆలయ పరిసరాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు.వృద్ధులు, దివ్యాంగ భక్తులకు ప్రత్యేక వాహన సదుపాయం కల్పించి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి శానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలని, చెత్త నిర్వహణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో వ్యాపారులు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, ధరల వివరాలు స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలని సూచించారు.అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలుగా అగ్నిమాపక శాఖ సిబ్బంది, ఫైరింజన్‌ను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.IMG-20260209-WA0093IMG-20260209-WA0094 బ్రహ్మోత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .