జ్యోతిర్ముడి కార్యక్రమంలో పాల్గొన్న పామిరెడ్డిపల్లి సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

జ్యోతిర్ముడి కార్యక్రమంలో పాల్గొన్న పామిరెడ్డిపల్లి సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

పెద్దమందడి, (తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న వైరాగ్యగిరి శివాలయంలో నిర్వహించిన జ్యోతిర్ముడి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరయ్య దాసు హాజరై శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకున్నారు. జ్యోతిర్ముడి కార్యక్రమం సందర్భంగా శివ నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అలాగే సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆధ్వర్యంలో జ్యోతిర్ముడి కార్యక్రమం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు స్వయంగా అన్నదాన వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాములమ్మ, మాజీ సర్పంచ్ తిక్కన్న, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, శివ స్వాములు, గురు స్వాములు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .