పెద్దమందడి అంగన్వాడీ టీచర్ మృతి

స్పందించిన ఎమ్మెల్యే మేఘరెడ్డి, సర్పంచ్ గంగ రవి

పెద్దమందడి అంగన్వాడీ టీచర్ మృతి

పెద్దమందడి,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని అంగన్వాడీ మొదటి సెంటర్‌లో పనిచేస్తున్న టీచర్ చిట్టమ్మ ఆదివారం తెల్లవారుజామున గుండెనొప్పితో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి విషయం వనపర్తి ఎమ్మెల్యే మేఘరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించారు.అంగన్వాడీ టీచర్లు లేదా హెల్పర్లు మృతి చెందితే తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని మేఘరెడ్డి గతంలో తెలిపారు.గతంలో వెల్టూర్ ప్రాంతంలో అంగన్వాడీ సిబ్బంది మృతి చెందిన సందర్భాల్లో కూడా ఆయన ఆర్థిక సహాయం అందించినట్లు గుర్తు చేశారు.ఈ ఘటనపై పెద్దమందడి మండల సర్పంచ్ గంగ రవి స్పందించి, మృతురాలి కుటుంబానికి రూ.5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా పెద్దమందడి మండలం అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల తరఫున బి. నారాయణమ్మ, రమాదేవి, రాఘవేంద్రమ్మ, రాణి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .