ఉప్పల్ కురుమ సంఘం అదనపు భవనం నిర్మాణం ప్రారంభం
రూ.30 లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, ఫిబ్రవరి 09 ( తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ డివిజన్ భరత్‌నగర్‌లో కురుమ సంఘానికి సంబంధించిన అదనపు భవనాన్ని కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనం కురుమ సంఘ కార్యకలాపాలకు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కురుమలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అలాగే అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కురుమల అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కురుమ సంఘ అభ్యున్నతికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉప్పల్ కురుమ సంఘం అధ్యక్షులు చిందం వెంకటేష్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి గొరిగే మల్లేష్ కురుమ, ముఖ్య సలహాదారులు గొరిగే రమేష్ కురుమ, జన్ని రఘు కురుమ, జోన్ కార్యదర్శి కోండ్ర హనుమంతు కురుమ, జోన్ ఉపాధ్యక్షులు గొరిగే పెద్ద మల్లేష్ కురుమ, ఉప్పల్ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల కృష్ణ కురుమ పాల్గొన్నారు.అలాగే సల్లా ప్రభాకర్ రెడ్డి, గొరిగే బాల మహేష్ చంద్ర కురుమ, బట్కిరి బీరప్ప, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మోటె నరసింహ కురుమ, కొల్లు ఐలయ్య కురుమ, గొరిగే మహేష్ కురుమ, జన్ని వెంకటేష్ కురుమ, కంకల ఎలేందర్ కురుమ, బట్కిరి ధన్ సాగర్ కురుమతో పాటుమహిళా అధ్యక్షురాలు బట్కిరి మంజుల కురుమ, గొరిగే నాగమణి కురుమ, బండారి మంజుల కురుమ, కేమిడి ఇందిర కురుమ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 


Comments