చేర్యాల పట్టణ అభివృద్ధే నా లక్ష్యం

ముస్త్యాల అరుణ బాల నర్సయ్య, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

చేర్యాల పట్టణ అభివృద్ధే నా లక్ష్యం

సిద్దిపేట, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):

చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ముస్త్యాల అరుణ బాల నర్సయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరో వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను అనురాగపూర్వకంగా కలుసుకుంటూ, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా స్పందిస్తూ, నిస్వార్థ సేవకురాలిగా పనిచేస్తానని ఆమె తెలిపారు. ఆరో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా వారి వద్దకే వెళ్లి పరిష్కారం చూపిస్తానని, చేర్యాల పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు. “మీ ఓటే నా బలం, మీరే నా బలగం” అని పేర్కొన్నారు.ఆరో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, రేషన్ కార్డుల మంజూరు, పెన్షన్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .