సమ్మెకు దూరంగా ఉండాలి.!

సింగరేణి కార్మికులకు యాజమాన్యం విజ్ఞప్తి.

సమ్మెకు దూరంగా ఉండాలి.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్తో పాటు రాష్ట్ర సంఘం టీబీజీకేఎస్ ఫిబ్రవరి 12న తలపెట్టిన ఒకరోజు సమ్మె నేపథ్యంలో, సింగరేణి సత్తుపల్లి ఏరియాలో యాజమాన్యం సమీక్ష సమావేశం నిర్వహించింది. మంగళవారం జి.ఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని యూనియన్ల ప్రతినిధులతో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ సమ్మెపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 12న నిర్వహించనున్న సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండి విధులకు హాజరై లక్ష్య సాధనలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చినప్పటికీ, ఆ సమ్మె డిమాండ్లలో అధిక భాగం సింగరేణి కార్మికులకు నేరుగా సంబంధించినవి కావని, అలాగే సింగరేణి యాజమాన్యం పరిధిలో పరిష్కరించగలిగిన అంశాలు కూడా కావని తెలిపారు. సింగరేణికి సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు, కార్మికులు సమ్మెలో పాల్గొనాల్సిన అవసరం ఉందా అనే అంశాన్ని ఆలోచించాలని కోరారు.
వివిధ కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ తొలగింపులో కొంత వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతీ రోజు సాధించే ఉత్పత్తి ఎంతో కీలకమని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగాలంటే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించి, రవాణా చేయడంలో కార్మికులు సహకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

 *ఒక్కరోజు సమ్మె జరిగితే…* 
- కంపెనీకి కలిగే ఉత్పత్తి నష్టం విలువ: సుమారు రూ.77 కోట్లు.
- కార్మికులు కోల్పోయే వేతనాలు: సుమారు రూ.12 కోట్లు.
- ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి నష్టం: 2.20 లక్షల టన్నులు.
గత ఆర్థిక సంవత్సరం 2024–25లో సింగరేణి సంస్థ 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధించిందని, ఉద్యోగులకు లాభాల బోనస్, పీఎల్‌ఆర్ బోనస్లు చెల్లించడంతో పాటు పలు సంక్షేమ పథకాలను కూడా అమలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 49 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని, మిగిలిన 23 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలిన రెండు నెలలు ప్రతీ రోజు శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ఫిబ్రవరి 12న తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండి విధులు నిర్వహించాలని కార్మికులను కోరారు.
ఈ సమావేశానికి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఎస్.ఓ టు జి.ఎం బొల్లం శ్రీనివాసు, ప్రాజెక్టు అధికారులు జేవీఆర్‌ఓసి ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్, కిష్టారం ఓసీ ఏ.ఎల్.ఎస్.వి. సునీల్ వర్మ, ఏరియా ఇంజినీర్ కె. సోమశేఖర్, కాలరీ మేనేజర్లు జేవీఆర్‌ఓసీ బి. రాజేశ్వరరావు, కిష్టారం ఓసీ రామకృష్ణ, సంక్షేమ అధికారులు కావ్య, శ్రీనివాస్, అలాగే సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్‌ఓసీ, జేవీఆర్‌సీహెచ్‌పీ, కిష్టారం ఓసీ గుర్తింపు సంఘాలు, ప్రాతినిధ్య సంఘాలు మరియు ఇతర యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు