మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన

మేడ్చల్–మల్కాజ్గిరి, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లేతో కలిసి మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు ఉపయోగించే సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రి, ఎన్నికల సిబ్బంది నిర్ణీత సమయంలో పోలింగ్ బూతులకు చేరుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.IMG-20260210-WA0082

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .