ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాయిస్ఫూర్తి విద్యార్థుల ప్రతిభ.

బీటెక్ మూడో సంవత్సరం ఫలితాల్లో అగ్రస్థానం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాయిస్ఫూర్తి విద్యార్థుల ప్రతిభ.

సత్తుపల్లి, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ తాజాగా ప్రకటించిన బీటెక్ మూడో సంవత్సరం తుది పరీక్షా ఫలితాల్లో బి గంగారం సాయిస్ఫూర్తి స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో విద్యార్థినీ–విద్యార్థులు అధిక మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరోసారి చాటారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి తెలిపారు.
 *ఈఈఈ* : విభాగంలో తాటి విశాల్ హర్షవర్ధన్ రావు 71 శాతం, సురోజు శ్రీకర్ 70 శాతం, కందుకూరి పద్మభూషణ్ 70 శాతం మార్కులు సాధించారు. 
 *ఈసీఈ* : విభాగంలో వేముల రమ్య 85 శాతం, ఎర్ర ధన్యశ్రీ 82.5 శాతం, గోదా పూజిత 81 శాతం మార్కులతో ప్రతిభ చూపారు.
 *సీఎస్ఈ* : విభాగంలో అచ్చే దుర్గాదీక్షిత 90.5 శాతం మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చగా, షేక్ ఇసుబ్ అలియా 87.5 శాతం, ఉప్పల శరణ్య, మల్లెల్లి రేణుక, రెడ్డి కావ్యాంజలి చెరో 87 శాతం మార్కులు సాధించారు. 
 *సీఎస్ఈ – ఏఐ & ఎంఎల్* : విభాగంలో మహమ్మద్ రజియా 80.5 శాతం, కాండూరి లక్ష్మి ప్రియ 80 శాతం, గుంట్రు రవీంద్ర, జంగాల హిమజ చెరో 79.5 శాతం మార్కులు సాధించారు.
 *ఏఐ & డీఎస్* : విభాగంలో అమరవరపు మాధురి 84 శాతం, కారుమూరి ప్రణయ్ వెంకటసాయి, ముచ్చర్ల హేమంత్ సాయి సుబ్రహ్మణ్యం చెరో 83 శాతం, మల్కాపురం నవీన్ కుమార్ 81.5 శాతం మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన విద్యా ట్రస్టీ శ్రీమతి బండి అన్విద వర్చువల్‌గా మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల సమిష్టి కృషే ఈ విజయానికి కారణమని పేర్కొంటూ అభినందించారు.
కళాశాల కార్యదర్శి మరియు ప్రతినిధి దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యలో పరీక్షలు విజయానికి ఒక దశ మాత్రమేనని, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాముల శేఖర్ బాబు, ఉప ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, వివిధ విభాగాధిపతులు విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .