పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బండారు శ్రీనివాస్

పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బండారు శ్రీనివాస్

వనపర్తి,ఫిబ్రవరి10(తెలంగాణ ముచ్చట్లు):

జైభేం సేవా సొసైటీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ తన 53వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. పుట్టినరోజును ఆర్భాటాలు, కేక్ కటింగ్‌లు, పార్టీలతో కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పుట్టినరోజుల సందర్భంలో అనవసర ఖర్చులు చేయకుండా, బండారు శ్రీనివాస్ మాదిరిగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పుట్టుక, చావు నీది… బ్రతుకంతా సమాజనిధి అనే భావనతో అందరూ సమాజ ఉన్నతి కోసం కృషి చేయాలని అన్నారు.సమాజం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, సేవా భావనతో ముందుకు వచ్చే వారే నిజమైన నాయకులని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కవి జనజ్వాల, భాలస్వామి, స్వామి, సురేందర్ తదితరులు పాల్గొని బండారు శ్రీనివాస్‌ను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .