గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు

చీరల పంపిణీతో ప్రజల నుంచి విశేష స్పందన

గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు

కాప్రా, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు గోగికార్ శివకుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని డివిజన్ పరిధిలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసేవే లక్ష్యంగా తన జన్మదినాన్ని ఆర్భాటాలకు దూరంగా జరుపుకోవడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు.ఈ సందర్భంగా గాంధీనగర్‌లో 300 మందికి, కాప్రా ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో 400 మందికి, వంపుగూడ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో 300 మందికి చీరల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సేవా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, స్టేట్ డైనమిక్ లీడర్ సోమశేఖర్ రెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, ఉప్పల్ మైనారిటీ లీడర్ బద్రుద్దీన్, టీఆర్‌ఎస్ నాయకుడు రాగి ఎట్లా కృష్ణ (కిట్టు)తో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా IMG-20260210-WA0084గోగికార్ శివకుమార్ మాట్లాడుతూ, తన జన్మదినాన్ని ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా కాప్రా డివిజన్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవ చేస్తానని ఆయన అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు