మృతి చెందిన అంగన్‌వాడీ టీచర్ కుటుంబానికి ఆర్థిక సాయం

ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ యూత్ అసోసియేషన్

మృతి చెందిన అంగన్‌వాడీ టీచర్ కుటుంబానికి ఆర్థిక సాయం

పెద్దమందడి,ఫిబ్రవరి10(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి అంగన్‌వాడీ టీచర్ చిట్టెమ్మ ఆకస్మిక మృతి వారి కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది.నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె మరణంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా, అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వంతో ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి తమ వంతు సహాయంగా రూ. 20,000/-(ఇరవై వేల రూపాయలు) నగదును సేకరించి, బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.కష్టకాలంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవలో ముందుండటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు, గ్రామ పెద్దలు హర్షిస్తూ అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .