కుషాయిగూడలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి వినతి

కుషాయిగూడలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి వినతి

_30 ఏళ్ల పాత డ్రైనేజ్‌తో ఇబ్బందులు – మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేత

కుషాయిగూడ, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ కుషాయిగూడ ప్రాంతంలో అనేక వీధులలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పాతదిగా ఉండటంతో, తరచూ మురుగు నీరు రోడ్లపైకి వచ్చి వీధులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఈ కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైనేజ్ సమస్య వల్ల పరిశుభ్రత లోపించి, దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రంగా మారుతున్నదని తెలిపారు.ఈ నేపథ్యంలో కుషాయిగూడలో డ్రైనేజ్ సమస్య ఉన్న వీధులలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తక్షణమే నిర్మించాలని కోరుతూ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబును, స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని వినతి పత్రంతో కలిసి కలిశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్‌లతో పాటు పండాల శివకుమార్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, చల్ల ప్రభాకర్, గంప కృష్ణ, యావపురం రవి, వెంకటేశ్వర్లు, కొడకండ్ల యాదయ్య, సల్ల వెంకటేష్, సారా అనిల్ ముదిరాజ్, పండాల గణేష్ గౌడ్, నలచెరువుల జనార్దన్, దయానంద్, ఆంజనేయులు యాదవ్, పులి నరేందర్, అనిల్ యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .