ఆపదలో అపర సంజీవినిలా 108, 102 అంబులెన్స్ సేవలు 

ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ కె. రవికుమార్

ఆపదలో అపర సంజీవినిలా 108, 102 అంబులెన్స్ సేవలు 

వనపర్తి,ఫిబ్రవరి10(తెలంగాణ ముచ్చట్లు):

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 108 మరియు 102 అంబులెన్స్ సేవలు అపర సంజీవినిలా ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ కె. రవికుమార్ పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలను వేగంగా, సమర్థవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు.మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో 108 అంబులెన్సులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంబులెన్సుల్లోని వైద్య పరికరాల పనితీరు, అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులను, ఆపదలో ఉన్న వారిని తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తూ 108 అంబులెన్స్ సేవలు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు.అలాగే 102 అమ్మఒడి అంబులెన్సుల ద్వారా గర్భిణీ స్త్రీలను రక్తపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి, పరీక్షలు పూర్తైన అనంతరం తిరిగి ఇంటికి చేర్చడం జరుగుతుందన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన తర్వాత తల్లి, బిడ్డలను ఉచితంగా ఇంటి దగ్గర దించడంతో పాటు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం కూడా అమ్మఒడి వాహనాలను వినియోగిస్తున్నట్లు వివరించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108, 102 అంబులెన్సుల ద్వారా ప్రజలకు నిరంతరం వైద్య సహాయం అందిస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కె. రవికుమార్ కోరారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెహబూబ్ బాషా, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బుద్వేష్, శశి, బీమేష్, పైలెట్లు భాస్కర్, నాగరాజు, శ్రీకాంత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు