వెల్టూర్‌లో వారాంతపు సంత ఏర్పాట్ల పనులపై గ్రామ నాయకుల పరిశీలన

వెల్టూర్‌లో వారాంతపు సంత ఏర్పాట్ల పనులపై గ్రామ నాయకుల పరిశీలన

పెద్దమందడిఫిబ్రవరి(10తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో వారాంతపు సంత ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్ గ్రామ నాయకులతో కలిసి సంత స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామ ప్రజలకు అవసరమైన వాణిజ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపడుతున్న పనుల పురోగతిపై గ్రామ నాయకులతో వారు చర్చించారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. వారాంతపు సంత గ్రామ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు.రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఈ సంత ద్వారా లభిస్తుందని తెలిపారు. దీంతో గ్రామంలో ఆర్థిక లావాదేవీలు పెరిగి, ప్రజలకు న్యాయమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు.సంతకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సదుపాయం, షెడ్లు, చెత్త నిర్వహణ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గ్రామ నాయకులకు సూచించారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించాలన్నారు.అలాగే గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారాంతపు సంతను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంత నిర్వహణ ద్వారా గ్రామానికి ఆదాయం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా వారాంతపు సంత నిర్వహణ జరిగేలా గ్రామ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు): మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న...
ఉప్పల్‌లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేయర్ గద్వాల విజయలక్ష్మికి పత్తి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ మను చౌదరి పరిశీలన
గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా
గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో సేవా కార్యక్రమాలు