సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో  కార్యక్రమం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

_నాచారం సర్కిల్ కార్యాలయం ఏర్పాటుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

మల్లాపూర్, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలో నాచారం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన సందర్భంగా మల్లాపూర్‌లోని డివిజన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, మక్తాల బాలరాజ్ గౌడ్, దంతూరి రాజు గౌడ్, కోయలకొండ రాజేష్, కప్పర సాయి, ఎస్.వి. కిట్టు, మెరుపుల బాలరాజ్, వి.శ్రీనివాస్, నుస్రత్ ఖాన్, పర్వతాలు, జానీ భాయ్, సాయి గౌడ్, మధు, నిక్కీ, టిల్లు, వినోద్ యాదవ్, విజయ్ రెడ్డి, అన్వర్, చారి, ఉపేందర్, పాషా, సాయి, హరి, రఘు, సురేష్, వినేష్ యాదవ్, యాద్గిరి, రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకురాళ్లు జమీలా, శైలజ, సోనీ, ఇష్రత్ బానో, కవితలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా మల్లాపూర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పాన్ని నాయకులు వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .