సత్తుపల్లిలో ఎన్నికల బందోబస్తుపై పోలీసుల బ్రీఫింగ్.

సత్తుపల్లిలో ఎన్నికల బందోబస్తుపై పోలీసుల బ్రీఫింగ్.

- కట్టుదిట్టమైన భద్రత.
- చట్టవ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు.

సత్తుపల్లి, ఫిబ్రవరి10 (తెలంగాణ ముచ్చట్లు):IMG-20260210-WA0034

ఈ నెల11వ తేదీన జరగబోయే సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరైన పోలీసు సిబ్బందికి డ్యూటీలో పాటించాల్సిన విధులు, జాగ్రత్తలపై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మరియు సత్తుపల్లి ఎస్‌హెచ్‌వో తుమ్మలపల్లి శ్రీహరి బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బందోబస్తులో 3 మంది ఏసీపీలు, 3 మంది సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, అలాగే సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాటు జిల్లాలో 163/బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా చేరినా, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బందికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని సత్తుపల్లి పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .