ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం

స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహణ

ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం

ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ కార్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు థామస్ ఆల్వా ఎడిషన్, చార్లెస్ డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.ముందుగా థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి విద్యావేత్త అనురాధ, చార్లెస్ డార్విన్ చిత్రపటానికి సోషల్ మీడియా ప్రముఖులు ఎం. భాస్కరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, ఎడిషన్ 179వ జయంతి, డార్విన్ 217వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. ఎన్నో విఫల ప్రయత్నాల మధ్య పట్టుదలతో కృషి చేసి ప్రపంచానికి వెలుగులు నింపిన మహనీయుడు ఎడిషన్ అని పేర్కొన్నారు. డార్విన్ మానవ పరిణామ క్రమాన్ని శాస్త్రీయ ఆధారాలతో ప్రపంచానికి పరిచయం చేసి విజ్ఞాన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.సామాజిక ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడుతూ, శాస్త్రవేత్తల ఆవిష్కరణల వల్లే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం అత్యవసరమని, మూఢనమ్మకాల వ్యతిరేకంగా సమాజం చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు.ఎం. భాస్కరరావు మాట్లాడుతూ, ఎడిషన్ బల్బుతో పాటు టెలిగ్రాఫ్ సహా అనేక ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించారని తెలిపారు. డార్విన్ తన సిద్ధాంతాల కోసం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలను పెంపొందించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని సూచించారు.విద్యావేత్త అనురాధ మాట్లాడుతూ, ఎడిషన్ పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం సభ్యులందరూ శాస్త్రవేత్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో ఎం. శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాస్, ఉన్ని కృష్ణన్, శోభ, గౌసియా, పి. మల్లేశం, వెంకటేశ్వర రావు, శారద, రుక్కయ్య, గిరీష్, శివరామకృష్ణ, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 
వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) : వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన...
నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు
ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం